టాలీవుడ్ ఇండస్ట్రీ లో తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుజిత్ ఒకరు. ఈయన రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన సాహూ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా ఓజి అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా కాలమే అవుతుంది.

సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత కాలానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో పవన్ వాటిపై దృష్టి సారించాడు. దానితో ఓజి సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక పవన్ "ఓజి" సినిమాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే ముందు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు ,  హరి శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీలను మొదలు పెట్టాడు. ఇక ఈ మూవీ షూటింగ్లో కూడా ఆగిపోవడంతో క్రిష్ ఆ గ్యాప్ లో కొండపొలం  అనే సినిమాను రూపొందించగా ... హరీష్ శంకర్ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాను రూపొందించాడు.

ఇలా పవన్ కళ్యాణ్ తో సినిమాలు కమిట్ అయిన ఈ ముగ్గురు దర్శకులలో క్రిష్ జాగర్లమూడి , హరీష్ శంకర్ , పవన్ బిజీగా ఉన్న సమయంలో ఇతర సినిమాలకు కమిట్ అయ్యి వాటిని పూర్తి చేశారు. కానీ సుజిత్ మాత్రం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నా వేరే సినిమా చేయలేదు. కేవలం ఓజి సినిమాపై  మాత్రమే కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఓజి మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్  హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: