ఈ మధ్యకాలంలో ముద్దు సీన్ లల్లో నటించమంటే హీరో హీరోయిన్ సిగ్గుపడడం కాదు .. రెడీ అయిపోయి ఎప్పుడెప్పుడు ముద్దు సీన్స్ లో నటిస్తామా..?? అంటూ వెయిట్ చేస్తున్నారు . ఒకప్పుడు హీరో హీరోయిన్లు ముద్దు సన్నివేశాలల్లో నటించమంటే అంటే పది రోజులు పైగానే టైం తీసుకునే వాళ్ళు.  ముద్దు సీన్స్ లో నటిస్తే ఏమనుకుంటారో ఏమో..? కుటుంబ సభ్యులు బాధపడతారేమో..? ఈ రకరకాలుగా చర్చించుకుని  ఫైనల్లీ ఆ సీన్స్లో  నటించేవారు కాదు. కానీ ఇప్పుడు అంత ట్రెండ్ మారిపోయింది .


ముద్దు సీన్స్ అంటే చాలా కామన్ గా ఉంది . డైరెక్టర్ షాట్ రెడీ అనగానే .. ముద్దు పెట్టేసి తర్వాత "ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ షూటింగ్ ..సినిమా ఇండస్ట్రీలో ఇవంతా కామన్ " అంటూ లైట్ గా తీసేసుకుంటున్నారు . కానీ  ఓ స్టార్ హీరో బిగ్ బడా ఫ్యామిలీ ని నుంచి  వచ్చిన హీరో మాత్రం ముద్దు సీన్ లో నటించమంటే షూటింగ్ సెట్ నుంచే వెళ్ళిపోయారు . అంతలా భయపడిపోయారు . ఆ హీరో మరి ఎవరో కాదు "రామ్ చరణ్" . ఆ సినిమా మరేంటో కాదు "చిరుత".  తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు  గ్లోబల్ వైడ్ పాపులారిటీ దక్కించుకుని మెగా పవర్ స్టార్ గా తన ఇమేజ్ పెంచుకున్న రామ్ చరణ్ డెబ్యూ చేసిన మూవీ చిరుత .



నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఈ సినిమాలో "లవ్ యు రా"  అనే సాంగ్ ఉంటుంది . చాలా చాలా రొమాంటిక్గా ఉంటుంది . అయితే ఈ సాంగ్ లో డైరెక్టర్ లిప్ లాక్ చేయాలి అంటూ పూరి జగన్నాథ్ ..చరణ్ ని రిక్వెస్ట్ చేశారట . చరణ్ కి ఇదే తొలి సినిమా . ఇలాంటి సీన్స్ లో నటిస్తే ఖచ్చితంగా యూత్ వేరే లెవెల్ లో ఎంకరేజ్ చేస్తారు . ఎలాంటి సీన్స్ అయినా తెరకెక్కించే సత్తా ఉన్న దర్శకుడు . కానీ చరణ్ మాత్రం ఆ సీన్ లో నటించను అంటూ చెప్పారట  నాకు భయం సార్ నేను చేయను అంటూ షూటింగ్ సెట్ నుంచి వెళ్లిపోయారట . రెండు రోజులు షూటింగ్ కే రాలేదట . ఆ తర్వాత చిరంజీవి కలగజేసుకొని ఆ సీన్స్ వద్దు అంటూ నచ్చజెప్పి పాటను లైట్ రొమాంటిక్ టచ్ తో ఫినిష్ చేశారు . ఇప్పుడు రామ్ చరణ్ బిగ్ పాన్ ఇండియా స్టార్ . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . అయినా సరే ఆయన రొమాంటిక్ సీన్స్ కి దూరంగానే ఉంటున్నారు . అది మెగా పెంపకం అంటే అంటూ జనాలు మెగాస్టార్ చిరంజీవిని ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు . ప్రజెంట్ "పెద్ది" సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్ . ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: