
ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. అయితే, ఈ విరామం తర్వాత మళ్లీ జెనీలియా వెండితెరపైకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా జెనీలియా జూనియర్ అనే సినిమాతో టాలీవుడ్‌లో తిరిగి కనిపించబోతున్నారు. కిరీటి హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జెనీలియా ఓ కీలక పాత్రలో నటించారు. ఇది ఆమెకు ఒక రకంగా ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ రీ ఎంట్రీ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొన్న జెనీలియా, తన భావాలను షేర్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “13 ఏళ్లుగా నా భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ గడిపాను. వాళ్లే నా ప్రపంచం అయిపోయారు. కానీ నా భర్త రితీష్ దేశ్‌ముఖ్ మాత్రం నన్ను మళ్లీ స్క్రీన్‌పై చూడాలని కోరుకుంటూ మూడేళ్లుగా నన్ను రీ ఎంట్రీ ఇవ్వమంటూ టార్చర్ చేస్తున్నాడు," అంటూ నవ్వుతూ చెప్పారు జెనీలియా. “ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవుతుండడంతో తిరిగి కెమెరా ముందు నిలబడగలిగాను.
వేద్ అనే మరాఠీ సినిమాలో నటించాను. అది సమంత నటించిన మజిలీ సినిమా రీమేక్. కానీ, ఈ జూనియర్ సినిమా నాకు కమర్షియల్‌గా రీ ఎంట్రీ అని చెప్పొచ్చు,” అని అన్నారు. తన కెరీర్‌తో పాటు తనతో కలిసి పనిచేసిన హీరోలు ఇప్పుడే పెద్ద స్టార్ స్టేటస్‌లో ఉండటంపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తెలుగులో మళ్లీ నటించాలని ఉందని పేర్కొన్నారు. "తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రేక్షకుల ప్రేమ వల్లనే హాసినిగా గుర్తింపు వచ్చింది. మళ్లీ అదే ప్రేమను అందుకోవాలని కోరుకుంటున్నాను," అంటూ అభిమానుల మనసులను తాకేలా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో జెనీలియా రీ ఎంట్రీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఓపికగా ఎదురు చూసిన జెనీలియా ఫ్యాన్స్ ఇప్పుడు ఆమెను తిరిగి తెరపై చూడటానికి ఉత్సాహంగా ఉన్నారు. మరి 13 ఏళ్ల గ్యాప్ తర్వాత జెనీలియా తిరిగి స్టార్ గా నిలవగలతారా? అన్నది చూడాలి! కానీ ఆమె ఉనికిని మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. "హాసిని ఈజ్ బ్యాక్!" – అని చెప్పొచ్చు.