పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పాన్ ఇండియా, పీరియాడిక్ యాక్షన్ డ్రామా  "హరి హర వీరమల్లు" ఇప్పటికే భారీ అంచనాలు సెట్‌ చేసుకుంది. సినిమా రిలీజ్ సమీపిస్తుండటంతో టీం స్పీడు పెంచింది. వరుసగా ప్రమోషనల్ అప్‌డేట్స్‌ ఇస్తూ, ప్రేక్షకుల ఉత్సాహాన్ని మరింతగా పెంచుతోంది. తాజాగా సినిమా  సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  చేసుకుని, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అయ్యింది. ఈ వేడుక మరెక్కడైనా కాదు…  హైదరాబాద్ శిల్పకళా వేదికలో  జూలై  21న  జరగబోతోంది! మొదటిది వైజాగ్‌లో సముద్ర తీరంలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసినా, పెద్ద సంఖ్యలో వచ్చే అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమన్న ఉద్దేశంతో చివరికి హైదరాబాద్‌ వేదికగా నిర్ణయించారు.
 

ఫ్యాన్స్ కు వీలుగా హైదరాబాద్ లొకేషన్‌ను సెలెక్ట్ చేయడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మినిస్టర్లు , అలాగే  కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్  ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నట్టు సమాచారం. మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు రావచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ రాజకీయ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.సినీ రంగం నుంచి స్టార్ డైరెక్టర్లు, టాప్ హీరోలు హాజరుకాబోతున్నారు. పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితుడైన  త్రివిక్రమ్  ఈ వేడుకలో పాల్గొనడం ఖాయం. ప్రస్తుతం పవన్‌తో సినిమాలు చేస్తున్న నిర్మాతలు, దర్శకులు, కొరియోగ్రాఫర్లు కూడా ఈ వేడుకలో కనిపించనున్నారని సమాచారం.


సినిమా ద్వారా  పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్ ఇండియా హీరోగా  రూపుదిద్దుకోబోతున్నారు. అలాగే ఇది ఆయన తొలి పీరియాడిక్ డ్రామా కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్‌ కోసం మేకర్స్ భారీ స్థాయిలో సెట్స్, విజువల్స్, గ్రాఫిక్స్‌పై కసరత్తు చేశారు.  డైరెక్టర్ జ్యోతికృష్ణ , క్రిష్‌ పాన్ ఇండియా విజన్‌తో సినిమాను రూపొందించగా, పవన్‌కు పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌కి విశేష స్పందన వచ్చింది. ఇప్పుడు  జూలై 21న ప్రీ రిలీజ్ వేడుక  అనంతరం, జూలై  24న సినిమా గ్రాండ్ రిలీజ్  కానుంది. ఈ వేడుక తరువాత మిగిలిన ప్రమోషన్లు, ఇంటర్వ్యూలతో వీరమల్లు ప్రమోషన్ ఊపందుకోనుంది. మొత్తానికి, పవన్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకోనున్న  హరి హర వీరమల్లు  ప్రీ రిలీజ్ వేడుక టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక గ్రాండ్ సెలబ్రేషన్‌గా నిలవబోతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: