పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో అత్యంత బిజీగా ఉన్నా కూడా తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడం కోసం అత్యంత చిత్త శుద్ధితో పని చేస్తున్నాడు. అందులో భాగంగా పవన్ ఉప ముఖ్యమంత్రి కాక ముందు కమిట్ అయిన హరిహర వీరమల్లు సినిమాను తాజాగా పూర్తి చేశాడు. ఈ మూవీ జూలై 24 వ తేదీన విడుదల కానుంది. అలాగే ఓజి సినిమాకు సంబంధించిన పవన్ పోర్షన్ ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్లో పవన్ పాల్గొంటున్నాడు.

ఇప్పటికే పూర్తి అయిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల అనగా జూలై 24 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న పవన్ కళ్యాణ్ వరుసగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. ఇవి ఇలా ఉంటే కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ పలికిన మనల్ని ఎవర్రా ఆపేది అనే డైలాగ్ ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో మన అందరికీ తెలిసిందే. ఈ డైలాగును అనేక సందర్భాలలో పవన్ అభిమానులతో పాటు మామూలు జనాలు కూడా అనేక సందర్భాలలో వాడుతూ వచ్చారు.

తాజాగా హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ... గతంలో నా సినిమాలు 10 , 15 రూపాయల ధరలతో నడిచాయి. ఆ రోజే నేను చెప్పాను మనల్ని ఎవడ్రా ఆపేది అని. ఇది డబ్బు మరియు రికార్డుల గురించి అస్సలు కానే కాదు. ధైర్యం  మరియు పట్టుదల గురించి మాత్రమే. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. టికెట్ రేట్లు పెరిగాయి అని చెప్పాడు. అలాగే మనల్ని ఎవడ్రా ఆపేది అనే డైలాగును మరోసారి పవన్ అన్నాడు. దానితో ప్రస్తుతం మళ్ళీ ఈ డైలాగు వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: