
వారాల తరబడి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చిన “వార్ 2 ట్రైలర్ ఎప్పుడొస్తుంది?” అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన ప్రకారం, జూలై 25, 2025న ట్రైలర్‌ను తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ట్రైలర్ నిడివి సుమారు 2 నిమిషాల 39 సెకన్లు ఉండనుందని సమాచారం. 2019లో విడుదలైన వార్ (War) సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో మనకు తెలుసు. హృతిక్ - టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ అప్పట్లో ప్రేక్షకులను పిచ్చెక్కించింది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకి మరో పవర్‌ఫుల్ చాప్టర్ వస్తోంది. మరి హృతిక్‌తో పాటు ఎన్టీఆర్ అడిషన్ వుంటే ఎలాంటి మాస్ ఫెస్టివల్ జరుగుతుందో ఊహించుకోవచ్చు.
ఇప్పటికే ఫ్యాన్స్ మద్య గట్టిగా వినిపిస్తున్న గాసిప్ ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ ఇందులో ఒక గ్రే షేడ్ పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే కథలో క్లైమాక్స్‌కు దగ్గరగా వచ్చేసరికి అతని రోల్ హిరోగా మారవచ్చునన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ రూమర్లే అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ప్రీతమ్ సంగీతం అందిస్తుండగా, యాక్షన్ సన్నివేశాలను ఇంటర్నేషనల్ స్టైల్‌లో తెరకెక్కించారన్నది మేకర్స్ మాట. యష్ రాజ్ ఫిల్మ్స్ స్టాండర్డ్‌కి తగ్గట్టే హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ ట్రీట్మెంట్ వుంటుందనేది ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌ని టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం వెనక హిట్ గ్యారంటీ ప్లాన్ ఉన్నట్టే తెలుస్తోంది. మొత్తానికి “వార్ 2” ట్రైలర్‌తో ఎలాంటి సర్ప్రైజ్ చూపించబోతున్నారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే జూలై 25న బాక్సాఫీస్‌కు కొత్త ఊపొస్తుందనడంలో సందేహం లేదు!
