
అయితే తాజాగా ఒక ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది . హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్లో హరిహర వీరమల్లు సినిమా చూడడానికి కొందరు మహిళలు సాంప్రదాయ శారీలో ముఖాలను చీరతో పూర్తిగా కప్పుకొని ధియేటర్స్ కి వచ్చారు . అక్కడ వాళ్ళను చూసిన జనాలు షాక్ అయిపోయారు . సినిమాకి ఇలా వచ్చారు ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా హైలైట్ ఏంటంటే సినిమా థియేటర్లోకి వచ్చి సీట్లలో కూర్చొని సినిమా బొమ్మ తెరపై పడినా కూడా వాళ్ళు ఆ చీర కొంగును తీయలేదు. ముఖాలు ఎవరికి కనిపించకుండా సినిమా చూశారు.
ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి . అయితే ఇదేమన్నా ఒక పద్ధతినా అంటూ కొంతమంది జనాలు ఆశ్చర్యపోతున్నారు . కానీ అసలు విషయం ఏంటంటే ఈ తిప్పలన్నీ కూడా అనుపమ పరమేశ్వరన్ నటించిన కొత్త సినిమా "పరదా" ప్రమోషన్స్ కోసం అంటూ బయటపడ్డింది. సినిమాకి ప్రమోషన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ . ఇక పవన్ కళ్యాణ్ సినిమాకి ఇలా వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటే ఇంకా హైలెట్. ఈ ఐడియా కొత్తగా ఉంది అని పవన్ సినిమాకు వచ్చి పరదా ప్రమోషన్స్ చేయడం వల్ల బజ్ కూడా ఎక్కువవుతుంది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
"పరదా" ఆగస్టు 22వ తేదీ థియేటర్లలో విడుదల కాబోతుంది . ఈ సినిమాపై కూడా మంచి హైప్ ఉంది . ఇక హరిహర వీరమల్లు సినిమాని కూడా ఈ ప్రమోషన్స్ లో వాడేసుకున్నారు మూవీ మేకర్స్. ఇప్పటి వరకు చాలా మంది కి పరదా సినిమా అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కారణంగా "పరదా" సినిమా ఒకటి తెరకెక్కుతుంది అని.. అందులో అనుపమ పరమేశ్వరణ్ నటిస్తుంది అని .. ఆగస్టు 22వ తేదీ రిలీజ్ కాబోతుంది అన్న విషయాలు తెలిశాయి . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది..!