నిన్న విడుదలైన ‘హరి హర వీరమల్లు’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ మొదటిరోజు కలక్షన్స్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ది బెస్ట్ అంటున్నారు. ఈరోజు రెండవరోజు కావడంతో ఈ మూవీ కలక్షన్స్ చాలచోట్ల డ్రాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ సక్సస్ మీట్ లో ఈమూవీ నిర్మాతలు ఇస్తున్న లీకులను బట్టి ఈమూవీకి సీక్వెల్ ఉంటుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.

వాస్తవానికి పార్ట్ 1 పూర్తి అయి విడుదల అవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. దీనికితోడు క్షణం తీరికలేని రాజకీయ వ్యవహారాల మధ్య బిజీగా ఉన్న పవన్ ఈమూవీ పార్ట్ 2 కోసం నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ ఎంతవరకు పవన్ ఈ సీక్వెల్ విషయంలో డేట్స్ ఇచ్చి సహాయపడగలడు అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. ఈసినిమాకు సంబంధించి రివ్యూలు సోషల్ మీడియా రియాక్షన్లు పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ ఈమూవీ నిర్మాతలు తమ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అని చెపుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈమూవీకి సంబంధించిన సెకండాఫ్ లో వచ్చిన విఎఫ్ఎక్స్ కంప్లైంట్స్ ని సరిచేసి పదిహేను నిమిషాల దాకా ఈమూవీ నిడివిని ట్రిమ్మింగ్ చేస్తారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడొచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుని పార్ట్ 2 విషయంలో జాగ్రత్తలు పడదామని నిర్మాతలు అంటున్నారు. దీనికన్నా ముందు ఈ పార్ట్ 1 పూర్తిగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కనీసం 10 రోజులపాటు ఈసినిమా కలక్షన్స్ నిలబడగలగాలి.

అయితే ఈ మూవీ చివరిలో పార్ట్ 2కు సంబంధించి కొన్ని లీకులు ఇస్తున్నప్పటికీ ఈమూవీకి పార్ట్ 2 నిజంగా వస్తుందా అన్న సందేహాలలో పవన్ అభిమానులు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ‘బాహుబలి’ ‘పుష్ప’ ‘కెజిఎఫ్’ లాంటి సినిమాల సీక్వెల్స్ బ్లాక్ బష్టర్ హిట్ అయిన పరిస్థితులలో ఈ సీక్వెల్ కు కూడ అలాంటి అదృష్టం వచ్చి తీరుతుందని పవన్ అభిమానుల ఆశ. మరేమీ జరుగుతుందో చూడాలి..    
     


మరింత సమాచారం తెలుసుకోండి: