సోషల్ మీడియాలో ఇన్నాళ్లు విశ్వంభర సినిమా గురించి ఎలా మాట్లాడుకున్నారో జనాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎంత పాజిటివ్ గా మాట్లాడుకున్నారో..  ఆ తర్వాత కొంచెం కొంచెంగా సినిమాకి నెగిటివ్ టాక్ ఎక్కువగా వచ్చింది . దానికి మెయిన్ రీజన్ సినిమా ఆలస్యం కావడమే . అన్ని అనుకున్న టయానికి అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి సినిమా రిలీజ్ అయిపోయి సూపర్ సూపర్ హిట్ టాక్ అందుకునేది . కానీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది . సినిమా ఆలస్యం ఎందుకు అంటే మాత్రమే ఒకే ఒక్క సమాధానం వి ఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్నాయి .


ఏవో చీప్ చీప్ గా వి ఎఫ్ ఎక్స్ పెట్టలేము.  మెగాస్టార్ చిరంజీవి సినిమా . అదిరిపోయే రేంజ్ లోనే ప్రతి ఒక్క సీన్ ఉంటుంది . ఆ కారణంగానే క్వాలిటీ మైంటైన్ చేస్తున్నాం . అందుకే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుంది అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు . కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయ్యింది.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో ఆయన హిట్ సాంగ్ రీమేక్ చేస్తున్నారు అని.. ఆ పాటలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయి చిందుల వేయబోతుంది అంటూ ఓ న్యుస్ బాగా ట్రెండ్ అయింది .



అయితే దానికి తగ్గట్టే మౌని రాయి "నేను హైదరాబాదులో ఉన్నాను" అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది . దానికి తగ్గట్టే మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమా ఆఖరి సాంగ్ షూటింగ్లో ఉన్నాను అంటూ ఒక పిక్ లీక్ చేశాడు . షూటింగ్ సెట్స్ లో ఈ పాట షూట్ చేస్తున్న ఫోటోను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.  దీంతో ఈ సినిమాలో ఆయన నటించిన "రగులుతుంది మొగలి పొద" అనే సాంగ్ రీమేక్  చేసి స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారుఅన్న విషయం ఆల్మోస్ట్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోయింది . మొదటగా స్పెషల్ సాంగ్ కోసం "ఆటకావాలా పాటకావాలా" అనే పాటను చూస్ చేసుకున్నారట . ఆ తర్వాత చిరంజీవి కెరియర్ లోనే ది బెస్ట్ గా నిలిచిన  రగులుతుంది మొగలి పొద సాంగ్ అయితే కుర్రాళ్లను బాగా కనెక్ట్ చేస్తుంది అని చరిత్రలో నిలిచిపోతుంది అంటూ మేకర్స్ ఇలా డిసైడ్ అయ్యి ఈ విధంగా పాటను  రీమేక్ చేశారట . దానికి సంబంధించిన సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు జరుగుతుంది . చిరంజీవి పెట్టిన పోస్ట్ తో అభిమానులు ఫుల్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తుంది.  యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: