సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఈయన సినీ కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలలో అతడు మూవీ కూడా ఒకటి.. ఈ సినిమాని బుల్లితెరపై ఎంతో మంది చూశారు. అయితే థియేటర్లో విడుదలైనప్పుడు కూడా ఈ సినిమా ప్లాఫ్ ఏమీ కాలేదు. ఒక్క రూపాయి కూడా నష్టం తెచ్చిపెట్టలేదని ఈ మూవీ నిర్మించిన జయభేరి బ్యానర్స్ అధినేత నటుడు నిర్మాత అయినటువంటి మురళీమోహన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక అతడు మూవీ పేరు మీద ఎప్పటికీ చెరిగిపోని ఓ రికార్డు కూడా ఉంది.అదేంటంటే ఇప్పటికే ఈ సినిమాని టెలివిజన్లో దాదాపు 1500 సార్లు టెలికాస్ట్ చేశారు. ఇలాంటి రికార్డు ఏ సినిమాకి కూడా లేదు.. 

అయితే అలాంటి మహేష్ బాబు నటించిన హిట్ సినిమా అతడు కి పార్ట్ 2 తీస్తారా అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళి మోహన్ కి ఓ షాకింగ్ ప్రశ్న ఎదురైంది. మరి దానికి ఆయన ఏం ఆన్సర్ ఇచ్చారు.. ఒకవేళ పార్ట్ 2 తీస్తే ఎవరిని హీరోగా పెడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మహేష్ బాబు హీరోగా త్రిష హీరోయిన్గా త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన అతడు మూవీ ఆగస్టు 9న రీ రిలీజ్ కాబోతోంది.అయితే ఈ సినిమా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో తాజాగా మూవీ ప్రమోషన్ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు సినిమా నిర్మాత మురళీ మోహన్..

అయితే ఇందులో భాగంగా ఈ సినిమాకి పార్ట్ 2 తీస్తారా అని ఓ రిపోర్టర్ అడగగా..కచ్చితంగా ఈ సినిమాకి సమయం ఇస్తే పార్ట్ 2 తీస్తాను. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే మహేష్ బాబుని హీరోగా పెట్టుకొనే తిస్తాను.ఎందుకంటే హీరోని చేంజ్ చేస్తే సినిమాను ఎవరు ఆదరించరు. వాళ్లు డేట్స్ ఇస్తే అతడు 2 చేస్తా. అలాగే ఈ సినిమా వల్ల ఎలాంటి నష్టాలు రాలేదు.ఇక ఈ సినిమా రీ రిలీజ్ చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ చేసిన సమయంలో చాలామంది థియేటర్లలో మిస్ అయ్యారు. ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఈ సినిమా ఫ్లాప్ అయ్యి డైరెక్టర్ హీరో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చారనే వార్త అవాస్తవం.

ఎందుకంటే ఈ సినిమాకి ఎలాంటి నష్టాలు రాలేదు. అలాగే ఈ సినిమాలో నాజర్ పాత్ర కోసం మొదట శోభన్ బాబుని అనుకున్నాం. ఆయన ఇంటికి బ్లాంక్ చెక్కు పంపించాం.కానీ ఆయన మాత్రం నేను ప్రేక్షకుల్లో ఎప్పటికీ హీరో గానే ఉంటాను అని తాత పాత్రలో నటించడానికి ఒప్పుకోలేదు అంటూ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు మురళీమోహన్. మరి మురళీ మోహన్ అన్నట్టు అతడు 2 లో నటించడానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ లు ఆసక్తి చూపిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: