- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

యంగ్ హీరో ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా తెరక్కేక్కిన చిత్రం ‘చౌర్య పాఠం’. ధమాకా, మజాకా చిత్రాల దర్శకుడు త్రినాథ రావు నిర్మాణంలో నక్కిన నెరేటివ్‌ బ్యానర్‌పై నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో రిలీజ్ అయింది. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, సలీం ఫేకు, సుప్రియ పలువురు కీలక పాత్రల్లో నటించారు. కథేంటంటే డైరెక్టర్ అవ్వాలని ఓ కుర్రాడు అనేక ప్రయత్నాలు చేసి ఇక తానే నిర్మాతగా స్వంతంగా సినిమా చేయాలనుకుంటాడు. కానీ తన వద్ద అంత మొత్తంలో డబ్బులు లేకపోవడంతో ఓ భారీ స్కెచ్ వేస్తాడు. సినిమా నిర్మించేందుకు అవసరమై డబ్బు సంపాదించలేమని తెలిసి ఓ గ్రామంలోని బ్యాంక్ దొంగతనం చేయాలనీ భావిస్తాడు. ఆ బ్యాంకు రాబరీ టైమ్ లో హీరో తెలుసుకున్న నిజాలు ఏంటి. చివరకు బ్యాంకు దొంగతనం చేసాడా లేదా అనే కధనంతో సాగుతుంది.


ఓ వైపు సస్పెన్స్ మైంటైన్ చేస్తూనే మరోవైపు తనదైన కామెడీతో నవ్వించారు మేకర్స్. అమేజాన్ ప్రైమ్ లో మే 27న స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ గా 200 మిలియన్  స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ రాబట్టి చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది.. చిత్ర హీరో ఇంద్రరామ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే నటుడు ఇంద్ర రామ్ తన రెండవ సినిమాతో మరో ప్రయోగాత్మక కధనంతో రాబోతున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: