
ఆమె చివరిగా నటించిన సినిమా "మంగళవారం". ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. తన ఖాతాలో బిగ్ బ్లాక్ బస్టర్ వేసుకునింది. ఆర్ఎక్స్ 100 తర్వాత అలాంటి హిట్ తన ఖాతాలో పడిన మూవీ మాత్రం ఇదే అని చెప్పాలి. కాగా ప్రెసెంట్ "వెంకట లచ్చిమి" అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటిస్తుంది . ఈ సినిమా కోసం చాలా కష్టపడుతుంది పాయల్ రాజ్ పుత్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ అభిమానులను కంట తడి పెట్టేలా చేస్తుంది.
తన తండ్రి మరణించాడు అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది పాయల్ రాజ్ పుత్. ఆమె పోస్ట్ లో లో తన తండ్రి అకాల మరణం చెందాడు అని తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది . ఆ పోస్టులో ఆమె రాసుకొస్తూ.." క్యాన్సర్ తో పోరాడాటానికి నేను మీకు ఎంతో సహాయం చేశాను నాన్న ..కానీ మిమ్మల్ని దక్కించుకోలేకపోయాను.. నేను చేయగలిగినంత చేశాను ..కానీ విజయం సాధించలేకపోయాను నన్ను క్షమించండి .. నేను మిమ్మల్ని మరొకవైపు చూస్తాను లవ్ యు నాన్న " అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది . చాలామంది స్టార్ సెలబ్రెటీస్ , ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకి సపోర్ట్ చేస్తూ మెసేజ్స్ చేస్తున్నారు. నువ్వు కెరియర్ లో మంచి స్థానానికి వెళ్ళితే మీ నాన్న ఎక్కడున్నా సంతోషపడతాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది...!