
గ్లోబల్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కన్నా హై స్థానంలో ఉన్నాడు. ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు . అలాంటి హీరో వద్దకు వచ్చి పరమ చెత్త ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేయమంటే ఊరుకుంటారా..? అసలు ఒప్పుకోరు. పైగా అలాంటి ప్రాడక్ట్ ని ప్రమోట్ చేస్తే మెగా ఫ్యామిలీకి ఉన్న పరువు కూడా పోతుంది . ముందు నుంచి కూడా కొన్ని ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడానికి మెగా ఫ్యామిలీ ముందు అడుగు వేయదు . ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వద్దకు వచ్చిన ఒక ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారట .
ఒకటి కాదు రెండు కాదు రెండు నిమిషాల యాడ్ కోసం ఏకంగా 15 కోట్లు రిజెక్ట్ చేశారట . ఇదే న్యూస్ ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. రామ్ చరణ్ వద్దకు ఆ బ్రాండ్ ప్రోడక్ట్ మేనేజర్స్ అప్రోచ్ అవ్వగా..తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలి అని.. తమ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలి అంటూ రిక్వెస్ట్ చేయగా చాలా సింపుల్ గా నో అంటూ రిజెక్ట్ చేసారట . దానికి కారణం కెమికల్స్ కలుపుతూ ఉండడం . అది చిన్న పిల్లలకు హానికరంగా ఉండడమే . ఆ కారణంగానే రామ్ చరణ్ ఈ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేయడానికి ఇష్టపడలేదట . ఆశ్చర్యం ఏంటంటే అంతకుముందు ఈ ప్రాడక్ట్ ని ఒక బడా స్టార్ సెలబ్రిటీ ప్రమోట్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ లో కూడా ఇరుక్కున్నారు . అవన్నీ గమనించిన రాంచరణ్ యాడ్ చేయకుండా మేనేజర్స్ కి ముఖానే నో అంటూ చెప్పేశాడట. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!