సినిమా ఇండస్ట్రీ లో ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరు రిజెక్ట్ చేసిన సినిమాలో మరొకరు నటించినట్లయితే ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడితే ఆ మూవీ ని ఆ రోజు రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాము అని హీరోలు అనుకోవడం , అదే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధిస్తే ఆ మూవీ ని ఆ రోజు రిజెక్ట్ చేసి ఉండకపోతే బాగుండేది అని అనుకోవడం కూడా చాలా కామన్. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి వెంకటేష్ , నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగార్జునమూవీ ని మిస్ చేసుకోగా అదే సినిమాలో హీరోగా నటించి వెంకటేష్ ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సినిమా ఏది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం విక్టరీ వెంకటేష్ "కలిసుందాం రా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొదట హీరో గా వెంకటేష్ ను అనుకోలేదట. మొదట ఈ మూవీ లో నాగార్జున ను హీరో గా అనుకున్నారట. అందులో భాగంగా ఆయనను వెళ్లి కలిసి ఈ సినిమా కథ మొత్తాన్ని కూడా మూవీ బృందం వినిపించిందట. కథ మొత్తం విన్నాక నాగార్జున ఈ స్టోరీ నాపై వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో ఈ మూవీ బృందం వారు వెంకటేష్ ను కలిసి ఆ మూవీ కథను వివరించారట. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఆ సినిమాలో నటించడానికి ఒకే చెప్పారట. ఈ మూవీ వెంకటేష్ కెరియర్లో బ్లాక్ బాస్టర్ మూవీల లిస్టులో చేరిపోయింది. అలా నాగ్ రిజెక్ట్ చేసిన మూవీ లో వెంకటేష్ నటించి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: