
కథ :
నార్మల్ పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసే సూరి (విజయ్ దేవరకొండ) అతని సోదరుడైన శివ(సత్యదేవ్) కోసం స్పైగా శ్రీలంకలోని ఒక దీవికి వెళ్లాల్సి వస్తుంది. శివ స్మగ్లర్ గా, గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడు? అన్నను కాపాడుకోవడానికి వెళ్లిన సూరికి ఎదురైన అనుభవాలేంటి? క్రూరమైన తెగకు సూరి నాయకుడు కావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాలు ఆ జాబితాకు చెందిన సినిమాలే అని చెప్పవచ్చు. కింగ్ డమ్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా విజయ్ దేవరకొండ కేజీఎఫ్ అని చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తన భుజాలపై మోశారని చెప్పవచ్చు.
సహజమైన నటనతో విజయ్ దేవరకొండ సూరి పాత్రకు ప్రాణం పోశారు. వన్ మ్యాన్ ఆర్మీలా సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అదరగొట్టారు. శివ పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నారు. తన పాత్రకు సత్యదేవ్ తన వంతు పూర్తిస్థాయి న్యాయం అయితే చేశారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పాత్ర పరిమితమే అయినా లుక్స్, యాక్టింగ్ తో ఆమె ఆకట్టుకున్నారని చెప్పవచ్చు.
ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ లో ఎమోషన్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. స్పై డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లు బాగానే ఉన్నా ఆ సీన్లను మరింత అద్భుతంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.
మళ్ళీ రావా, జెర్సీ సినిమాలతో మ్యాజిక్ చేసిన గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ సినిమాతో సైతం మరోసారి మ్యాజిక్ చేశారు. సినిమా అద్భుతం అని చెప్పలేం కానీ ఈ వీకెండ్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపించడంతో పాటు గతంలో హిట్టైన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుఢ్ ఈ సినిమాకు మరో బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. ఈ సినిమా మ్యూజిక్, బీజీఎమ్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ టాప్ రేంజ్ లో ఉండగా గిరీష్, జెమోన్ తెరపై విజువల్స్ ను అందంగా చూపించే విషయంలో సక్సెస్ అయ్యారు. ఎడిటర్ నవీన్ నూలిని నాగవంశీ ఎందుకు నమ్ముతారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. నవీన్ నూలి ఈ సినిమాకు ప్లస్ అయ్యారు. రగిలే సాంగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులను వెంటాడుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు : విజయ్ దేవరకొండ నటన, మ్యూజిక్, ఫస్టాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్,
బలహీనతలు : సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు, కథలో కొత్తదనం లేకపోవడం
రేటింగ్ : 3.0/5.0