
సోషల్ మీడియాలో కూడా అనసూయ నెగిటివ్ కామెంట్స్ పైన దిమ్మతిరిగే సమాధానాలు తెలియజేస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు అనసూయ మాటలు చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కొంతమంది పోకిరిలకు అనసూయ చెప్పు తెగుద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇటీవలే అనసూయ మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
షాపింగ్ మాల్ స్టేజ్ మీద అనసూయ మాట్లాడుతూ ఉన్న సమయంలో కొంతమంది యువకులు చాలా అసభ్యకరంగా మాట్లాడడంతో అనసూయ ఫైర్ అయినట్టు కనిపిస్తోంది. వారి మాటలకు అనసూయ చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మా ,చెల్లి ,ప్రియురాలు , మీ కాబోయే భార్య ఉండరా వారిని ఇలానే ఏడిపిస్తూ ఉంటారా అంటూ ఫైర్ అవుతూ పెద్దవారిని ఎలా గౌరవించాలో మీ ఇంట్లో వాళ్ళు నేర్పించలేదా అంటూ తీవ్రస్థాయిలో వీరుచుకుపబడింది అనసూయ. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనసూయ కి మద్దతుగా నెటిజెన్స్ నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది .ఇప్పటికే తన కెరీయర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో కూడా నటించింది.