
పఠాన్ లో దీపికా, టైగర్ లో కత్రినా, వార్ లో వాణి కపూర్ – ఇలా ఈ యూనివర్స్ లో హీరోయిన్ల గ్లామర్ అంతగా హైలైట్ అయ్యింది. ఇప్పుడు వార్ 2లో ఆ రోల్‌ను కియారా అద్వానీ స్వీకరించారు. సినిమాకు గ్లామర్ ఓ స్పెషల్ అడిషన్ అని చెప్తున్నంత పని చేశారు. ఇప్పటికైతే పాటల లెవెల్లోనే అది కన్పిస్తున్నా… సినిమా మొత్తం రిలీజయ్యాక కియారా స్క్రీన్ ప్రెజెన్స్ దేనికంటే ఎక్కువగా నిలవనుందని బోలెడన్ని కామెంట్లు వస్తున్నాయి. టీజర్‌లో కనిపించిన ఆమె బికినీ గ్లింప్స్‌కి అప్పుడే పెద్దగా చర్చ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఆ పాటలో ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చినట్టుంది. పాటకు కియారా గ్లామర్ టచ్… సినిమాకు క్రేజీ హైప్‌ను పెంచేస్తోంది. ఆగస్ట్ 14న సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో… మరిన్ని రొమాంటిక్ మూడ్ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
వార్ 2లో కియారా పాత్ర పెద్దదే కాదు అనేది మొదట్లో విన్న న్యూస్. కానీ ఇప్పుడు చూస్తుంటే… ఆ పాత్రలో గ్లామర్ మోతాదు, హాలీవుడ్ స్టయిల్ లో ఉండే స్పై సినిమాల్లో లాగా ఉండబోతుందనిపిస్తోంది. జేమ్స్ బాండ్ ఫార్ములా స్పై మూవీస్‌లో ఎలా ఫీమేల్ లీడ్ కంటెంట్ ఉంటుంది… అలాగే ఇక్కడ కూడా స్కోప్ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి… యాక్షన్‌తో పాటు గ్లామర్‌ను సమానంగా హైలైట్ చేయాలనే ప్లాన్‌తో వార్ 2 బలమైన ప్రమోషన్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కియారా అద్వానీ స్క్రీన్ ప్రెజెన్స్… ఇక యూత్ ఆడియన్స్‌కి హై ఓక్టేన్ థ్రిల్‌తో పాటు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది!