
సినిమా ఇండస్ట్రీలో హీరోల పారితోషికాలు ఎప్పుడూ హాట్ టాపిక్. ముఖ్యంగా స్టార్ హీరోల రెమ్యునరేషన్‌లు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుంటాయి. కానీ, ఈ రెమ్యునరేషన్ లెక్కలు నిజంగా ఎంతవరకూ వాస్తవం అన్నది మాత్రం తెలియని విషయమే. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ వార్త ఆసక్తిగా మారింది. ఎన్టీఆర్ ప్రస్తుతం రు. 100 కోట్ల క్లబ్‌లో ఉన్నా, గతంలో మాత్రం చాలా తక్కువ పారితోషికం తీసుకున్నారన్న నిజం వెలుగులోకి వచ్చింది. 'నాన్నకు ప్రేమతో' సినిమాకు ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.7.33 కోట్లు మాత్రమే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా విడుదలైన అనంతరం పన్నుల విషయంలో వచ్చిన ఆరోపణలకు స్పందించిన ఎన్టీఆర్ తన ఆదాయ వివరాలను స్పష్టంగా వెల్లడించడం జరిగింది. ఇది అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ఆర్థిక పారదర్శకత విషయంలో ఓపెన్‌గా ఉండడాన్ని పలువురు అభినందించారు.
‘నాన్నకు ప్రేమతో’ సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తారక్ కెరీర్‌లో క్లాస్ సినిమాగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ విజయంతోనూ ఎన్టీఆర్ పారితోషికం పెంచుకోలేదనే మాట వినిపించడం విశేషం. ఎన్టీఆర్ తక్కువ పారితోషికం తీసుకోవడానికి మరో ముఖ్య కారణం నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందిన 'ఊసరవెల్లి' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల, ఆ నష్టాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో తారక్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ ? ఎన్టీఆర్లోని ఫ్రెండ్లీ ప్రొడ్యుసర్‌ను చూపించడానికి ఇదే పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు