యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి నటించిన వార్2 సినిమా ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తారక్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా లైఫ్ లో ఏది ఎలా జరగాలో ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని తారక్ అన్నారు. కుంగ్ పూ పాండాలో కొటేషన్ నాకు ఇష్టమని తారక్ పేర్కొన్నారు. నిన్నటి రోజు చరిత్ర అని రేపటి రోజు తెలియని మర్మమని కానీ ఈరోజు మన చేతిలో ఉన్న గొప్ప బహుమతి అని ఆయన చెప్పుకొచ్చారు.

నేను నా దృష్టిని ఎప్పుడూ  వర్తమానంపైనే పెడతానని తారక్ వెల్లడించారు.  ఒక నటుడిగా నేను ఏది చేయడానికైనా సిద్ధమేనని  నా కుటుంబంలో సినీ వారసత్వం ఏమవుతుందో ఇప్పటికిప్పుడు నాకు తెలియదని తారక్ అన్నారు. అందుకోసం నేనేమీ ప్లాన్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.  ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కథలను చెప్పడం ద్వారా ప్రేక్షకులకు దగ్గర కావాలని అనుకున్నానని తారక్ వెల్లడించారు.

కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎమోషన్స్ కలగలిసిన నిజాయితీపరుడిగా  అందరూ  నన్ను  గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నానని  ఆయన చెప్పుకొచ్చారు.  వార్2 సినిమాకు అయాన్  ముఖర్జీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 10వ తేదీన జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

యశ్  రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలను సృస్తిస్తుందో చూడాల్సి ఉంది. ఎస్క్వేర్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ తారక్ ఈ విషయాలను  వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: