- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ , పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ అలాగే రిద్ధి కుమార్ లు హీరోయిన్లు గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్ హార్ర‌ర్ సినిమా “ ది రాజా సాబ్ ”. ప్ర‌భాస్ రెండు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌తో ఫామ్ లో ఉండ‌డంతో రాజాసాబ్ సినిమా పై సైతం మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రాజాసాబ్ సినిమా రిలీజ్ ని ఈ ఏడాది డిసెంబరుకి ముందుగా లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో ఈ డేట్ జ‌న‌వ‌రి లో సంక్రాంతికి వెళ్లి పోతుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ పై నిర్మాత టీజీ విశ్వ ప్ర‌సాద్ క్లారిటీ ఇచ్చేశారు. తాము రాజా సాబ్ సినిమాను సంక్రాంతి కానుక‌గా జనవరి 9 రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.


సంక్రాంతి సీజన్ కు సినిమాను రిలీజ్ చేస్తే క‌లెక్ష‌న్లు బాగుంటాయ‌న్న‌దే నిర్మాత‌ల ప్లాన్‌. సో డిసెంబర్ 5 స్లాట్ ఖాళీ అయినట్టే అనుకోవాలి. అయితే స‌డెన్ ట్విస్ట్ ఏంటంటే ఈ డేట్ కు బాలయ్య సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “ అఖండ 2 ” వస్తుందనే బజ్ కూడా చాలా రోజులు నుంచి న‌డుస్తోంది. ఇప్పుడు దీనిపై కూడా అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇది వరకు అఖండ పార్ట్ 1 కూడా డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చి అఖండ విజయం సాధించింది. మ‌రి ఇప్పుడు సీక్వెల్ కు కూడా అదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందేమో ?  చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: