
ఆ విషయంలో నో డౌట్ . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల ఫ్రెండ్షిప్ వేరే లెవెల్ . అందరికీ ఎక్స్పోజ్ చేయరు . కానీ సైలెంట్ గా వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు . ఒక అకేషన్ కి ఇద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం . ఒకరి పుట్టినరోజులకి మరొకరు విష్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు . కాగా పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు కాంబోలో ఎప్పటినుంచో సినిమా రావాలి అంటూ వెయిట్ చేస్తున్నారు అభిమానులు . కానీ కుదరలేదు . అయితే ఒకే సినిమాలో కనిపించకపోయినా ఒకే దగ్గర ఫ్లెక్సీలల్లో మాత్రం కనిపించారు .
ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు బాగా వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయ్యింది. మంచి హిట్ టాక్ సంపాదించుకుంది . ఇప్పుడు అతడు సినిమా రిలీజ్ అవుతుంది . పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఫ్లెక్సీ పక్కనే అతడు కి సంబంధించిన కటౌట్ ని ఫిక్స్ చేశారు అభిమానులు . దీంతో పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు ఇద్దరు పక్కపక్కనే చూస్తే కడుపు నిండిపోతుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కటౌట్ పక్కనే మహేష్ బాబు కటౌట్ థియేటర్ దగ్గర దర్శనం ఇచ్చింది. అంతే ఇక ఈ పిక్స్ ని సోషల్ మీడియా లో ట్రెండ్ చేసేస్తున్నారు అభిమానులు . దీంతో ఈ క్రేజీ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!
