
2022 ఆగస్టు 5న అంటే నిన్నటికి సరిగ్గా మూడేళ్ల క్రితం విడుదలైన సీతా రామం సినిమా తొలి ఆట నుంచే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటు సౌత్ పాటు అటు నార్త్ లోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతా మహాలక్ష్మి క్యారెక్టర్ లో మృణాల్ తమ నటనతో ఆన్ స్క్రీన్ పై మిస్మరైజ్ చేశారు. ఈ పాత్రలకు తాము తప్ప మరెవరూ సరిపోరు అన్నంతలా మెప్పించారు.
సీతారామంతో దుల్కర్ సల్మాన్‌కు టాలీవుడ్ లో స్పెషల్ మార్కెట్ ఏర్పడింది. ఆయన బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేయడం షురూ చేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సీతారామం స్టోరీ దుల్కర్ సల్మాన్ కన్నా ముందు మన తెలుగు హీరోలు ఇద్దరి వద్దకు చేరింది. కానీ ఆ ఇద్దరూ సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. ఇంతకీ సీతా రామం వంటి ఎపిక్ లవ్ స్టోరీని రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కీ హీరోలు ఎవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని, రామ్ పోతినేని.
డైరెక్టర్ హను సీతారామం కథను మొదట నానికి చెప్పారట. ఆయనకు కథ నచ్చినప్పటికీ అప్పటికే చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉండటంతో సున్నితంగా నాని నో చెప్పాడట. ఆ తర్వాత రామ్ ను సంప్రదించగా.. మాస్ కథలపై మనసు పారేసుకున్న ఆయన సీతారామం వంటి లవ్‌స్టోరీని చేసేందుకు ఆసక్తి చూపలేదట. చివరకు హను రాఘవపూడి తెలుగు హీరోలను పక్కన పెట్టేసి దుల్కర్ సల్మాన్‌కు ఓటేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.