టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ వైపు బాలీవుడ్‌ను , మరోవైపు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ప్రపంచాన్ని కూడా తనదైన స్టైల్‌తో శాసిస్తున్నాడు. ఇటీవల ఆయన ప్రఖ్యాత అంతర్జాతీయ మ్యాగజైన్ "ఎస్క్వైర్ ఇండియా" కవర్ పేజీకి ఎంపికయ్యాడు. దుబాయ్‌లో జరిగిన ఈ హై ఎండ్ ఫోటోషూట్‌లో తారక్ లుక్, స్టైల్, ప్రెజెన్స్ అంతా మాస్‌తో పాటు క్లాస్‌ను కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎస్క్వైర్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో... తన కెరీర్, పాత్ర ఎంపికలు, వార్ 2పై అంచనాలపై మాట్లాడుతూ… అసలు షాకిచ్చిన విషయం ఇంకొకటి. "సినీ వారసత్వం ఏమవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇందుకోసం నేను ఎలాంటి ప్లానింగ్ చేయలేదు" అని తారక్ చెప్పడం అభిమానులను కాస్త ఊహించని టోన్‌లోకి తీసుకెళ్లింది.

ఎన్టీఆర్ అభిమానులకు, సినీ పరిశ్రమలకూ ఇది షాకే. ఎందుకంటే ఆయన పేరు చెప్పగానే గుర్తొచ్చే పదం – “వారసత్వం”. ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగు ప్రజలకు సెంటిమెంట్. కానీ తారక్ మాత్రం చాలా స్పష్టంగా, నిజాయితీగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమాలు అంటే మోజు కాదు, బాధ్యత అని ఆయన మాటల్లో చూపించారు. వార్ 2తో బాలీవుడ్ షేక్ ..  తారక్ ఇప్పుడు నటిస్తున్న వార్ 2 సినిమాలో బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ హై య‌క్ష‌న్ థ్రిల్లర్ అగస్ట్ 14న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇదే తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్రశాంత్ నీల్ మూవీమాస్ vs మాస్! వార్ 2 తర్వాత తారక్ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇంకా టైటిల్ ఫిక్స్ కాకపోయినప్పటికీ, ఇంట్రెస్ట్ పెంచేలా బజ్ ఉంది. 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి... ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ ఫేజ్‌లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఆయన మాటలు మాత్రం ఇంకా చాలా మానవీయంగా ఉన్నాయి. సినీ వారసత్వం అనే పెద్ద పదాన్ని ఒడిసిపట్టుకుని బ్రాండ్‌గా మలుచుకునే స్టార్ ల సమయంలో, తారక్ మాత్రం… “అది నా కోసం ఎవ్వరూ ప్లాన్ చేయలేదు .. నేనూ చేయను” అని బ్యాలెన్స్ & హ్యూమానిటీ చూపించాడంటే, అందుకే ఆయన అభిమానుల మన్ననలు అందుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: