శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో కలిసి దాదాపు మూడు సినిమాలు చేసింది. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తను చేసే ప్రతి ఒక్క సినిమాలో ఏ హీరోయిన్ ని కూడా మరోసారి రిపీట్ చేయలేదు. కానీ శృతిహాసన్ విషయంలోనే ఇది రిపీట్ అయింది. శృతిహాసన్ ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ వంటి మూడు సినిమాల్లో నటించింది. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ తో నటించిన శృతిహాసన్ ఏకంగా ఆయన్ని అవమానిస్తూ మాట్లాడిందని పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. శృతి హాసన్ నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా మూవీ కూలీ..

 రజినీకాంత్ హీరోగా..నాగార్జున విలన్ గా.. ఉపేంద్ర, శృతిహాసన్ వంటి వాళ్ళు కీ రోల్స్ పోషిస్తున్న కూలి మూవీకి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ చేశారు.అయితే ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతుండడంతో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసిన సమయంలో స్టేజ్ మీద ఉన్న శృతిహాసన్ ని యాంకర్ సుమ మీరు టాలీవుడ్ లో ఉన్న హీరోలతో ఎవరెవరి నుండి ఏమేమి దొంగలిస్తారు అని ప్రశ్నించింది. దాంతో పవన్ కళ్యాణ్ నుండి మీరు ఏం దొంగతనం చేస్తారు అంటే ఆయన నుండి దొంగలించడానికి ఏమీ లేదు. ఎందుకంటే అవి ఆయనకు మాత్రమే సెట్ అవుతాయి.

మరొకరికి సెట్ కావు అని చెప్పింది.ఆ తర్వాత ఆయన చరిష్మాని దొంగలించొచ్చు కదా అని సుమ అంటే.. ఆ చరిష్మా ఇక్కడున్న నాగార్జున సార్ లో కూడా ఉంది అని చెప్పింది. ఆ తర్వాత ఆయన ఎనర్జీ మీరు దోచుకోవచ్చు కదా అని సుమ అంటే.. ఆ ఎనర్జీ కూడా నాగార్జున సార్ లో ఉంది అని చెప్పింది.అయితే శృతిహాసన్ పవన్ కళ్యాణ్ ని పొగుడుతూ ఆయనలో ఉన్న ఏ క్వాలిటీని కూడా మనం దొంగలించుకోలేం అన్నట్టుగా మాట్లాడింది. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ని నాగార్జున తో పోలుస్తూ శృతిహాసన్ అవమానించింది అంటూ వైరల్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: