సినిమా ఇండస్ట్రీ లో ఓ నటీమణికి మంచి విజయం దక్కింది అంటే ఆ తర్వాత వరుస పెట్టి చాలా వరకు అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాగే కొంత మంది మంచి విజయాలు దక్కి మంచి క్రేజ్ వచ్చాక చాలా సినిమా అవకాశాలను దక్కించుకొని ఆ తర్వాత కూడా విజయాలను అందిపుచ్చుకున్నట్లయితే చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి కూడా చేరుకుంటూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో ఓ ముద్దుగుమ్మ తక్కువ సినిమాలలో నటించిన ఓ మూవీ తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో తను అందాలతో మాత్రమే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఆమెకు వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది భావించారు.

కానీ ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని ఆశగా రంగనాథ్. ఈమె కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. 

సినిమా విడుదల అయ్యి ఇప్పటికే ఏడాదిన్నర సమయం గడుస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర సినిమాలో ఆశికా రంగనాథ్ నటిస్తోంది. ఈ మూవీ ని మినహాయిస్తే ఈమె చేతిలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. దానితో చాలా మంది ఆశిక రంగనాథ్ "నా సామి రంగ" సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం ఈమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడం ఆమె బ్యాడ్ లక్ అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: