పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితమే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల , రాశి కన్నా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యాక పవన్ రాజకీయ పనులతో బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ కొంత కాలం పాటు ఆగిపోయింది.

దానితో ఆ గ్యాప్ లో ఈ మూవీ దర్శకుడు హరీష్ శంకర్ , రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కూడా అయ్యింది. ఇకపోతే కొంత కాలం కృతమే ఈ మూవీ షూటింగ్ మళ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా  జరుగుతుంది. తాజాగా ఈ మూవీ నిర్మాతలలో ఒకరు అయినటువంటి నవీన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశారు. తాజాగా మైత్రి నిర్మాతలలో ఒకరు అయినటువంటి నవీన్ మాట్లాడుతూ  ... ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన షూటింగ్ ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది.

అది కాకుండా మరో 20 , 25 రోజుల షూటింగ్ మాత్రమే ఈ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ ఉంది. దానితో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అని మైత్రి నిర్మాతలలో ఒకరు అయినటువంటి నవీన్ చెప్పుకొచ్చాడు. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఇక మరి కొంత కాలం లోనే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజి సినిమా కూడా విడుదల కానుంది. ఆ తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా పవన్ సినిమాలు వరుస పెట్టి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: