మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. తన ప్రతిభా, స్వయంకృషితో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. న‌టుడిగానే కాకుండా ఎన్నో సేవాకార్య‌క్ర‌మాలు చేప‌ట్టి స‌మాజ సేవ‌కుడిగానూ గుర్తింపు పొందారు. తాజాగా చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, ఫీనిక్స్‌ ఫాండేషన్ సంయుక్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగాబ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించాయి.


ఈవెంట్ కు చిరంజీవి స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌రు కాగా.. హ‌నుమాన్ హీరో తేజ స‌జ్జా, ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ సంయుక్త మీన‌న్ త‌దిత‌రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి స్టేజ్ పై తాను బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి గల కారణాల్ని, రక్తదానం అవశ్యకతను వివ‌రించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకుంది.


జ్యోతి ప్రజ్వలనతో మెగాబ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. అంద‌రూ చెప్పులు విడిచి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా షూ విడిచి జ్యోతి విలిగించారు. అయితే తిరిగి షూ వేసుకునే టైమ్ లో చిరు కొంత ఇబ్బంది గుర‌య్యారు. చుట్టూ ఉన్న‌వారు అది గ‌మ‌నించి ఆయ‌న‌కు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. అక్క‌డే ఉన్న హీరోయిన్ సంయుక్త మీన‌న్ సైతం కింద‌కు వంగి చిరంజీవికి షూ తొగ‌డ‌బోయింది. వెంట‌నే ఆమెను వారించిన చిరు.. మ‌రొక వ్య‌క్తి హెల్ప్‌తో షూ వేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. స్టార్ హీరోయిన్ హోదాలో ఉండి కూడా సంయుక్త పెద్ద‌ల ప‌ట్ల చూపుతున్న గౌర‌వానికి అంద‌రూ ఫిదా అవుతున్నారు. ఆమె సంస్కారంపై సినీ ప్రియులు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: