సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఈ అమ్మడు ఇటు సౌత్ లోనే కాకుండా అటు నార్త్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకుంది. ప్ర‌స్తుతం స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో దూసుకుపోతోంది. అవకాశం వచ్చినప్పుడ‌ల్లా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ మూవీ లవర్స్ కు మంచి ట్రీట్ ఇస్తుంది.


ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనే తమన్నా.. తన ప్రొఫెషన్, పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ సౌత్ స్టార్ హీరో త‌న‌కు క్షమాపణ చెప్పిన విష‌యాన్ని గుర్తు చేసుకుంది. తమన్నా మాట్లాడుతూ.. `ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంత కాలానికే సౌత్‌లో పెద్ద‌ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ లభించింది. అయితే ఆయనతో కలిసి కొన్ని సీన్స్ లో నటించేటప్పుడు నేను చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యాను.


ఇదే విషయాన్ని దర్శకనిర్మాతలకు చెప్పగా.. హీరో నాపై కేకలు వేయడం స్టార్ట్ చేశారు. హీరోయిన్ ని మార్చండి అంటూ నన్ను అవ‌మానించారు. సెట్‌లో అంద‌రి ముందు అలా కేకలు వేయగానే చాలా బాధపడ్డాను. కానీ తిరిగి మనం కూడా అలానే రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదని భావించి మౌనంగా ఉన్నాను. మరుసటి రోజు ఆ హీరో తనంతట తానే నా వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పారు. తనకు కోపం వచ్చి అలా అరిచానని వివరణ ఇచ్చారు` అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. అయితే సారీ చెప్పిన ఆ స్టార్ హీరో పేరు మాత్రం ఆమె రివీల్ చేయలేదు. దీంతో ఆ హీరో ఎవరో తెలుసుకునేందుకు నెటిజ‌న్లు తెగ ఉత్సాహం చూపుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: