
అయితే, "సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ సమాధానం చెబుతాం" అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం పరిస్థితి కొంత మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంత హైలైట్ చేస్తూ చూపించారో, హృతిక్ రోషన్‌ను కూడా అలాగే చూపించారు. కానీ కొన్ని VFX సీన్స్‌లో హృతిక్ రోషన్ చూపించినంత హుందాగా ఎన్టీఆర్‌ను చూపించలేకపోయారని ఆ విషయంలో అయాన్ ముఖర్జీ తడబడ్డారని అంటున్నారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ పాత్ర కూడా పెద్దగా ప్రత్యేకతలతో లేకుండా, నార్మల్ కథలో సాగే పాత్రేనని, కానీ ఆ పాత్రకే జీవం పోశాడు ఎన్టీఆర్ తన నటనతో అని ఆయన పర్ఫార్మెన్స్‌ను ప్రశంసిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్, డైలాగ్స్, డ్యాన్స్ కలిపి చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో రణబీర్ కపూర్ ఆ పాత్ర చేసి ఉంటే ఇంకా బాగుండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. "అనిమల్" సినిమా చూసిన తర్వాత రణబీర్ కపూర్‌లోని నెగిటివ్ షేడ్స్ అందరికీ బాగా నచ్చాయి. అందువల్ల ఈ సినిమాలో కూడా రణబీర్ ఆ పాత్రలో నటించి ఉంటే, సినిమా వేరే లెవల్లో హిట్ అయ్యేది. పైగా, బాలీవుడ్ హీరో కాబట్టి మరింత మంది ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉండేది అని ఓ వర్గం ప్రేక్షకులు అంటున్నారు.
మొత్తానికి, ఈ సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ పాత్రను ఇంకొంచెం బాగా రాసి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి, ఈ టాక్‌తో ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో సినిమా..??