తాజాగా మద్రాస్ హైకోర్టు విష్ణువుని పూజించే బ్రాహ్మణులు మాత్రమే వైష్ణవులు కాదు అని ఆయన పూజించే ప్రతి ఒక్కరు కూడా వైష్ణవులే అని మద్రాస్ హైకోర్టు తాజాగా వ్యాఖ్యానించింది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా తమిళ నాడు లోని కాంచీపురం దేవరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రసాద దుకాణాలను నిర్వహించే హక్కును కేవలం వైష్ణవ బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి అని , ఇతరులకు ఇచ్చే ప్రభుత్వ వేలం పాట ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని కోరుతూ చెన్నై వెస్ట్ మాంబళంకు చెందిన ఎల్ రవి అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

ఇక 2002 వ సంవత్సరం వైష్ణవ బ్రాహ్మణుడు కానీ వ్యక్తి కి ఆ సమయం లో దుకాణం ఇచ్చారు అని , ప్రసాదం తయారీ లో ఆ వ్యక్తి నిషేధిత ఉల్లి , వెల్లుల్లి , మునగ ను వినియోగించాడు అని , దాని వల్ల పెద్ద అపచారం జరిగింది అని కోర్టుకు ఆయన విన్నపించారు. ప్రసాదం తయారీ హక్కును కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వాలి అని ఆయన కోరారు. అలాగే ప్రస్తుతం ఆలయ వేలం పాట లో వైష్ణవ బ్రాహ్మణులు అనే మాటను కూడా చేర్చాలి అని ఆయన కోరారు. ఈ విషయం పై మద్రాస్ హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ ... కేవలం వైష్ణవ బ్రాహ్మణులకే ఇవ్వాలి అనే మాటలను తప్పు పట్టింది.

ఆలయ ఆగమన శాస్త్ర నిబంధనల ప్రకారమే వేలం పాటను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంటుంది  అని , పైగా వైష్ణవ ఆలయాల్లో ప్రసాదం తయారీలో ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన వారినే మాత్రమే వేలం పాటలో ఆహ్వానిస్తుంది అని , ఈ విషయంలో తప్పు పెట్టడానికి ఏమీ లేదు అని చెబుతూ  మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే విష్ణుమూర్తి ఆలయంలో కేవలం వైష్ణవ బ్రాహ్మణుల దుకాణాలు నడపాలి అనే వాదనను కూడా సమర్థించలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: