కొంత మంది చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకో లేక సూసైడ్ చేసుకొని ప్రాణాలను తీసుకుం టూ ఉంటారు . తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అసలు విషయం లోకి వెళి తే  ... తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కీయార అద్వానీ హీరోయిన్గా వార్ 2 అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో తారక్ , హృతిక్ లాంటి భారీ క్రేజ్ ఉన్న హీరోలు నటించడం వల్ల ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

అలా భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా తాజాగా ఆగస్టు 14 వ తేదీన పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అది ఎలా అనుకుంటున్నారా ..? నంద్యాల జిల్లాలోని రుద్రవరం మండలం చంద్రపూర్ కు చెందిన ఆంజనేయులు , ప్రసన్న ఇద్దరు దంపతులు. ప్రసన్న కి 28 సంవత్సరాలు. ఇక ప్రసన్న భర్త అయినటువంటి ఆంజనేయులు వార్ 2 సినిమాకు వెళ్తాను అని భార్యకు చెప్పాడట.

కానీ అందుకు భార్య అసలు అంగీకరించలేదట. దానితో బుధవారం రాత్రి ఆంజనేయులు మరియు ప్రసన్న మధ్య గొడవ జరిగిందట. ఇక గొడవ జరిగినా పట్టించుకోకుండా ఆంజనేయులు గురువారం రోజు వార్ 2 సినిమాకు వెళ్లాడట. దానితో మనస్థాపానికి గురైన ప్రసన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందట. ఇలా తాను వద్దన్నా కూడా భర్త వినకుండా వార్ 2 సినిమాకు వెళ్లడంతో మనస్థాపానికి గురైన ప్రసన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: