
అయితే ఈ సమయంలో కూలీకి వచ్చిన నెగిటివ్ టాక్ సందీప్ రెడ్డి వంగాకు భారీ ప్లస్‌గా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. కూలీ సినిమాకి భారీ కలెక్షన్ లు వస్తున్నా కానీ నెగిటివ్ టాక్ ఎక్కువ వినిపిస్తుంది. డైరెక్షన్ లో కొన్ని లోపాలు ఎత్తి చూపుతున్నారు జనాలు. అందుకే ఈ సినిమాకి ఇంత నెగిటివిటి వచ్చింది. నిజానికి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్‌కి ఛాన్స్ ఇస్తారని ఒక వార్త బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు లోకేష్ దర్శకత్వంపై నెగిటివిటీ ఎక్కువ కావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి రామ్ చరణ్ తప్పుకున్నారట.
ఆ ఛాన్స్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాకు దక్కినట్లు తెలుస్తోంది. అనిమల్ తర్వాత ఆయన స్పిరిట్ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత రామ్ చరణ్‌తో ఒక సినిమా చేయాలనే ప్లాన్ ఇప్పటికే ఉంది. లోకేష్ ప్లేస్‌లో సందీప్ రెడ్డి వంగా వచ్చేయడంతో అది చకచకా జరిగిపోయిందని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ఇది ఆయనకు జాక్‌పాట్ ఛాన్స్ అంటున్నారు.చూడాలి మరి, ఏమవుతుందో..!