
బోయపాటి ప్రత్యేకతే అయిన ఎమోషనల్ హై పాయింట్స్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో మరింత ఘనంగా రూపుదిద్దుకుంటున్నాయని సినిమా యూనిట్ చెబుతోంది. ఈ విషయంలో రాజీ పడవద్దని బాలయ్య ప్రత్యేకంగా గైడ్‌లెన్స్ ఇచ్చారట. ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తున్నారు. బాలయ్యతో ఆమె జంట ఎలా కనెక్ట్ అవుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమన్ ఈ అఖండ 2కు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సూపర్ హైప్ క్రియేట్ చేసింది.
‘అఖండ 2 – తాండవం’ సినిమాను ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయాలని చిత్రబృందం ఖరారు చేసింది. ఆ రోజున తెలుగు రాష్ట్రాలే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా పెద్ద ఎత్తున స్క్రీన్లు దక్కబోతున్నాయని సమాచారం.