హీరో, హీరోయిన్ చనిపోతారు అనే ట్రాజెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అనుమానాల నడవ 1989లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఉత్తమ ప్రజాదారణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. అలాగే ఆరు నంది అవార్డులను సైతం కైవసం చేసుకుంది. తొలి సినిమాతోనే హీరోయిన్ గిరిజ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.
గీతాంజలి సినిమాలోని `ఓం నమః` సాంగ్ లో నాగార్జునకు మూడు నిమిషాలకు పైగా లిప్ లాక్ ఇచ్చి రికార్డు సెట్ చేసిన ఘనత గిరిజకే సొంతం. అయితే హీరోయిన్స్ ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఆ వెంటనే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంటారు. కానీ గిరిజ అందుకు పూర్తిగా భిన్నం. గీతాంజలి తర్వాత ఆమె పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపలేదు. విదేశాలకు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. ఇక అప్పటికీ ఇప్పటికీ గిరిజ చాలా మారిపోయింది. ముఖం అంతా ముడతలు పడిపోయి గుర్తుపట్టలేని విధంగా తయారైంది.ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి