ఈమె సౌత్ నార్త్ లో స్టార్ హీరోయిన్.. ఎంతోమంది దిగ్గజ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అలాగే పర్సనల్ లైఫ్ తో పాటు క్యాన్సర్ కూడా రావడంతో ఎన్నో ఇబ్బందులు పడింది.ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.ఆమెనే బాలీవుడ్ నటి మనిషా కొయిరాలా.. మనిషా కొయిరాల కేవలం బాలీవుడ్ లోనే కాదు  సౌత్ ఇండస్ట్రీ లో కూడా పరిచయం ఉన్న హీరోయిన్..ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు, భారతీయుడు, బాబా, క్రిమినల్,బొంబాయి వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాలకంటే ఎక్కువగా తాను పెట్టుకున్న అఫైర్స్ ద్వారానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే మనిషా కొయిరాలా ఇప్పటి వరకు దాదాపు పదికి పైగా మందితో ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి. అలా ఈమె పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే మనిషా కొయిరాలా తాజాగా సంచలన కామెంట్లు చేసింది. తాజాగా మనిషా కొయిరాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటినుండి నేను సింగల్ లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నాను.నిరర్ధకరమైన సంబంధాలు పెట్టుకోవడానికి రెడీగా లేను. నా లైఫ్ లో ఇప్పటినుండి మగాడి అవసరం లేదు. క్యాన్సర్ తో పోరాడుతున్ననన్ని రోజులు నా జీవితం విలువ ఏంటో నాకు తెలియ చెప్పింది.అంతే కాదు ఇన్ని రోజులుగా చెత్త ఎఫైర్స్ పెట్టుకొని చెత్త సంబంధాల వలన లైఫ్ ని, సమయాన్ని రెండింటిని వృధా చేసుకున్నాను.

 ఇప్పటినుండి నేను వాటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక మనిషా కొయిరాలా నానా పటేకర్, క్రిస్టోఫర్ డోరిస్, ఆర్యన్ వేద్, డీజే హుస్సేన్, సిసిల్ ఆంథోనీ, క్రిస్పిన్ కొన్ రాయ్, వివేక్ ముష్రాన్ వంటి వాళ్ళతో ఎఫైర్లు పెట్టుకుంది. ఇక చివరికి నేపాల్ కి చెందిన సామ్రాట్ దహాయ్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకున్నప్పటికి ఈ పెళ్లి బంధం కూడా ఎన్నో రోజులు నిలువలేదు. రెండు సంవత్సరాలకే విడిపోయారు.. ఇక ఈ బంధాల వల్ల విసుగు చెందిన మనిషా కొయిరాల ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడపాలనుకుంటుంది కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: