మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె మలయాళ సినిమాల ద్వారా నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె నటించిన మలయాళ  ప్రేమమ్ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు మలయాళం ఇండస్ట్రీ లో మంచి విజయం , సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో మొదటగా "అఆ" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. కెరియర్ ప్రారంభంలో ఈమె చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు ఫుల్ కేక్ ను ఎక్కిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె రౌడీ బాయ్స్ , టిల్లు స్క్వేర్ మూవీలలో భారీగా అందాలను ఆరబోసింది. తాజాగా ఈ బ్యూటీ పరదా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

మూవీ కి సంబంధించిన ఓ టీ టీ పార్ట్నర్ ఇప్పటికే లాక్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు కొనుగోలు చేసినట్లు , అందులో భాగంగా కొన్ని వారాల ధియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: