
అయితే ఈ సినిమా కోసం బాగానే ఖర్చు చేసినట్లుగా కనిపిస్తోంది. కొన్నేళ్లపాటు శ్రమించి తీసిన అర్జున్ చక్రవర్తి సినిమా ఇప్పటికే కొన్ని చిత్రోత్సవాలలో ప్రదర్శించారు. అలా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగానే సినిమా ట్రైలర్ ను కూడా చిత్ర బృంద విడుదల చేశారు. ఒక కబడ్డీ క్రీడాకారుడి కథ అంశంతో తెరకెక్కించిన సినిమాగా కనిపిస్తోంది. ట్రైలర్ విషయానికి వస్తే.. అనాధ అయిన ఒక కుర్రాడు కబడ్డీ కోచ్ చేరదీసి అతడిని మేటి క్రీడాకారుడుగా తీర్చదిద్దుతాడు.. ఆటలో గొప్ప పేరు సంపాదించిన తర్వాత తనలాగే ఎంతోమంది ఛాంపియన్ కావాలని కలలు కంటున్న వారి కోసం ఒక అకాడమీ ని ఏర్పాటు చేయాలని అర్జున్ చక్రవర్తి భావిస్తారు. అతడి ప్రయత్నం ఫలించదు.. అలాగే మరొకవైపు ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడంతో తాగుడికి బానిసై ఆటకు దూరమవుతారు.
ఇలా తన జీవితం మిస్సిందనుకున్న సమయంలో మళ్ళీ ఛాంపియన్ అనిపించుకోవడం కోసం ఒక అవకాశం వస్తుంది. ఆ తర్వాత నిజంగానే ఛాంపియన్ అనిపించుకున్నారా లేదా? అనే కథ అన్నట్లుగా కనిపిస్తోంది. గతంలో తెలుగులో జెర్సీ, సుల్తాన్ వంటి చిత్రాలు వచ్చినప్పటికీ అర్జున్ చక్రవర్తి సినిమా ట్రైలర్ కాస్త విభిన్నమైన సన్నివేశాలతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. చాలా సీరియస్ గానే ఈ సినిమా తీసినట్లుగా , హీరో కూడా ప్రాణం పెట్టి మరి నటించినట్లుగా కనిపిస్తోంది. టైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.