ఒకరు కాదు… ఇద్దరు కాదు… ఏకంగా కోట్లాదిమంది అభిమానుల కోరికను నిజం చేశాడు అల్లు అర్జున్. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. మనందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా  మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ మధ్య ఎప్పటికప్పుడు రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ గాసిప్స్ వల్లే ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరిగాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధాలు నడిచాయి. ఒకరు ఒకరిని కించపరిచేలా పోస్ట్‌లు చేస్తూ, కామెంట్స్ వేస్తూ వాతావరణం హీటెక్కిపోయింది. అయితే ఈ విషయానికి సంబంధించి స్టార్స్ మాత్రం ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడలేదు.


కానీ ఒక హీరో పుట్టినరోజున మరో హీరో విష్ చేయకపోతే మాత్రం సోషల్ మీడియాలో అదో పెద్ద హైలైట్‌గా మారింది. ఉదాహరణకు .. రామ్ చరణ్ పుట్టినరోజున అల్లు అర్జున్ విష్ చేయకపోవడం, అల్లు అర్జున్ పుట్టినరోజున రామ్ చరణ్ విష్ చేయకపోవడం… ఈ విషయాలు ఫ్యాన్స్ మధ్య తగాదాలను మరింత పెంచేశాయి. దీంతో ఈ హీరోల మధ్య నిజంగానే దూరం పెరిగిందా? అనే అనుమానం అందరిలో మొదలైంది. అంతేకాదు, మెగా కాంపౌండ్ ఫంక్షన్లకు అల్లు అర్జున్ అడుగుపెట్టడం లేదు అంటూ అనేక రకాలుగా ట్రోల్స్ చేశారు. అయితే ఇవన్నీ ఒక్కసారిగా మారిపోయేలా చేసిన అల్లు అర్జున్ చేసిన పని హైలెట్ గా మారింది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అసలు అల్లు అర్జున్ విష్ చేస్తాడా? చేయడా? అని చాలామంది సందేహపడ్డారు. కొందరైతే "బన్నీ అసలు విష్ చేయడనే చేయడు" అని ఫిక్స్ అయ్యిపోయారు. కానీ అందరి అంచనాలకు విరుద్ధంగా, ఒక మెట్టు దిగి అల్లు అర్జున్ తన మామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


అది కూడా చాలా స్పెషల్‌గా – “హ్యాపీ బర్త్‌డే మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్‌తో ఫ్యాన్స్ మధ్య ఉన్న కోపం, దూరం అన్నీ కరిగిపోయాయి.ఇక సోషల్ మీడియాలో లైక్స్, షేర్లు వర్షంలా కురుస్తున్నాయి. కామెంట్స్ సెక్షన్ మొత్తం అల్లు అర్జున్‌ను ప్రశంసలతో నిండిపోయాయి. మెగా అభిమానులు కూడా “ఇదే కావాలి… ఫ్యామిలీ బాండింగ్ ఇలాగే ఉండాలి” అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బన్నీ అభిమానులు అయితే మరింత ఎమోషనల్‌గా స్పందిస్తూ – “ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన హీరో. అల్లు అర్జున్ నిజంగా రియల్ హీరో” అంటూ గర్వపడుతున్నారు. ఈ ఒక ట్వీట్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు అల్లు అర్జున్. అంతేకాదు, మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి, మళ్లీ ఒక సాన్నిహిత్య వాతావరణం తీసుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: