సాధారణంగా సినిమాలను ఎవరైనా తెరకెక్కిస్తారు. కొంచెం డైరెక్షన్‌పై అవగాహన ఉండి, జనాలను ఎంటర్టైన్ చేయగలమనే నమ్మకం ఉంటే డైరెక్షన్ రంగంలోకి వస్తారు. కానీ అలా వచ్చిన ప్రతి డైరెక్టర్ సక్సెస్ అవుతాడా అంటే “కాదు” అనే చెప్పాలి. చాలా తక్కువమంది మాత్రమే స్టార్ డైరెక్టర్స్‌గా ఎదగగలరు. వారిలో ఒకరు రాజమౌళి. ఇండస్ట్రీలో రాజమౌళికి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించే సినిమాలు ఎంత ఎంటర్టైన్ చేస్తాయో అందరికీ తెలిసిందే. కానీ ఆ సినిమాల వెనుక ఆయన పడే కష్టం..ప్రతి విషయాన్ని ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో కొందరికి మాత్రమే తెలుసు.


ప్రస్తుతం మహేష్ బాబుతో ఒక సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఎక్కడా అధికారికంగా ప్రియాంకా హీరోయిన్ అని ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక చోప్రా లీడ్ క్యారెక్టర్‌లో మాత్రమే నటించనున్నారు, హీరోయిన్‌గా కాదు. హీరోయిన్ పాత్రకు వేరే స్టార్ బ్యూటీని ఎంపిక చేయాలని రాజమౌళి నిర్ణయించారట. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్స్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆలియా ఈ కథకు ఓకే చెప్పితే మిగతా పేర్లను ఆయన డిలీట్ చేస్తారట. ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ మొత్తం ఆలియాపైనే ఉందని టాక్.



సినిమా గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్నందున అన్ని భాషలకు చెందిన నటీనటులు ఇందులో భాగమవుతారని సమాచారం. లేటెస్ట్ న్యూస్ ప్రకారం, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా కాదు, ఆలియా భట్ నటించే అవకాశం బలంగా కనిపిస్తోంది. అయితే ప్రియాంక చోప్రా క్యారెక్టర్ చాలా స్పెషల్‌గా ఉండబోతోందట. అంతేకాక, సినిమాలో మహేష్ బాబు పాత్రకన్నా కూడా ఆమె రోల్ హైలైట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. ఇక చూడాలి మరి – జక్కన్న ఎలాంటి మ్యాజిక్ చూపిస్తారో..!

మరింత సమాచారం తెలుసుకోండి: