పైన ఫోటోలు ఇద్దరు చిన్నbపిల్లలు కనిపిస్తున్నారు కదా ..? ఆ చిన్న పిల్లలు ఎవరో గుర్తుపట్టారా ..? వారిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి , ఎన్నో విజయాలను అందుకొని , టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఓ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు తమిళ సినీ పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్గా కేరిర్ ను కొనసాగిస్తుంది. ఇంతకు వారిద్దరు ఎవరో గుర్తుపట్టారా ..? వారు ఎవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి కీర్తి సురేష్ ,  కళ్యాణి ప్రియదర్శిన్. కీర్తి సురేష్ , రామ్ పోతినేని హీరో గా రూపొందిన నేను శైలజ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ మంచి విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్క సారిగా భారీగా పెరిగింది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన కొన్ని సినిమాలు తెలుగు లో మంచి విజయాలు సాధించడంతో ఈమె చాలా తక్కువ కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయి కి చేరుకుంది. ప్రస్తుతం కూడా ఈమె తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. అలాగే తమిళ సినీ పరిశ్రమలో కూడా ఈమెకు అద్భుతమైన గుర్తింపు ఉంది. ఇక కళ్యాణి ప్రియదర్శిన్ విషయానికి వస్తే ... ఈమె అక్కినేని అఖిల్ హీరో గా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన హలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. దానితో ఈ మూవీ తర్వాత కూడా ఈమె పలు తెలుగు సినిమాలలో నటించింది. ఈమెకు తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రాలహరి మూవీ ద్వారా మంచి విజయం దక్కింది. ప్రస్తుతం వీరిద్దరు కూడా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లుగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: