జాన్వీ కపూర్ సిద్ధార్థ్ మల్హోత్రా కాంబోలో రాబోతున్న పరమ్ సుందరి మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది.ఆగస్టు 29 న విడుదల కాబోతున్న పరమ్ సుందరి మూవీకి సంబంధించి గత కొద్దిరోజుల క్రితమే నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. అలా సౌత్ నార్త్ లో ఉన్న అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా వివాదా స్పద పోస్టులు చేసే క్రిటిక్ ఉమైర్ సందు సిద్ధార్థ్ మల్హోత్రా జాన్వీ కపూర్ లకు సంబంధించిన రెండు వీడియోలు పోస్ట్ చేసి వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఒక వీడియోలో జాన్వీ కపూర్ కి సిద్ధార్థ్ మల్హోత్రా 2 సార్లు కేక్ తినిపించి ఆమె నోట్లో పెట్టిన వేలినే మళ్లీ నాకాడు. 

అయితే ఈ వీడియోని ఉమైర్ సందు పోస్ట్ చేసి ఈ విధంగా ట్వీట్ చేశారు.కియారా అద్వానీ కాస్త నీ భర్త పై కన్నేసి ఉంచు. జాన్వీ కపూర్ తో నీ భర్త సరసాలు ఆడుతున్నాడు చూడు అంటూ ట్వీట్ పెట్టాడు. ఇక మరో వీడియో కింద జాన్వీ కపూర్ తన అందాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక ఈ యువ నటి అందానికి సిద్ధార్థ్ మల్హోత్రా పడిపోయాడు. పరమ్ సుందరి సినిమా చేసే సమయంలో ఆమె మోజులో పడిపోయాడు.

 అలాగే జాన్వీ కపూర్ ని ట్రాప్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.. అంటూ సంచలన ట్వీట్ పెట్టాడు.ప్రస్తుతం ఉమైర్ సందు పెట్టిన ఈ రెండు ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఈయన పెట్టిన ట్వీట్ ల గురించి చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమందేమో ఈయన గురించి అందరికీ తెలిసిందే.. దీని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పచ్చగా ఉండే సంసారంలో చిచ్చు పుట్టించడం ఈయనకు బాగా వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: