టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా, క్యూట్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా, బాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “మాస్ జాతర” సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను రేపుతోంది. మొదటిసారి రవితేజ - శ్రీలీల కాంబినేషన్‌లో వస్తుండటంతో పాటు, రవితేజ మార్క్ ఎనర్జీకి తగ్గట్టుగా మాస్ ట్రీట్మెంట్ ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్ప‌టికే డీసెంట్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా, పలు వాయిదాలు పడుతూ చివరికి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని అనుకున్నాం. కానీ తాజాగా మేకర్స్ మరోసారి వాయిదా ప్రకటించారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన స్ట్రైక్ కారణంగా సినిమా పనులు డిలే అవ్వడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే కొత్త డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ స్పష్టం చేశారు.


సెప్టెంబర్ నెలలోనే ఇప్పటికే పలు భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందువల్ల “మాస్ జాతర”కి సరైన స్లాట్ దొరక‌డం క‌ష్టంగా ఉంది. దీంతో అక్టోబర్‌లో థియేటర్స్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్‌లో ఈ సినిమా మరో కీలక మాస్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందన్న న‌మ్మ‌కాలు ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించగా, ఆయన కంపోజ్ చేసిన పాటలు యువతలో మంచి రెస్పాన్స్ తెచ్చుకునేలా ఉంటాయని యూనిట్ అంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.


మొత్తానికి, రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “మాస్ జాతర” మరోసారి వాయిదా పడినా, మాస్ మజా పక్కా అని మేకర్స్ చెప్పడంతో, ఈ సినిమా విడుదల తేదీపై అందరి దృష్టి నిలిచింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: