పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా విడుదలై మిక్స్డ్ టాకును సంపాదించుకుంది. ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా హడావిడి చేసేస్తున్నారు ఫాన్స్. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకం పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు.


థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు .ఇప్పటికే ఓజి చిత్రం నుంచి ఫైర్ స్మార్ట్ అనే మొదటి సింగిల్ తో బాగానే క్రేజ్ తెచ్చుకుంది..ఇప్పుడు ఓజి సినిమా నుంచి విడుదలైన రెండవ పాట" సువ్వి సువ్వి"సాంగ్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని అభిమానులకు కలిగిచ్చేలా కనిపిస్తోంది. హృదయాలను హత్తుకునేలా సాగిన ఈ మెలోడీ సాంగ్ అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ గా మారుతోంది. ఈ గీతాన్ని శృతిరంజని పాడింది. ఈ సాంగులోని ప్రతి లైన్ కూడా హృదయాలను హత్తుకునేలా కనిపిస్తోంది.వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాటని విడుదల చేశారు.


సాంగ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సరికొత్త రొమాంటిక్ యాంగిల్  కనిపిస్తోంది.. ఈ లిరికల్ వీడియోలో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాజిటివ్ గానే తెచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకున్నారో అభిమానులు అలా చూపించారు డైరెక్టర్ సుజిత్. ఓజి సినిమా తారాగణం విషయానికి వస్తే.. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి విలన్ గా నటిస్తూ ఉండగా.. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఓజి చిత్రం మాస్ క్లాస్ ఆడియన్స్ ని అందరినీ కూడా అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ కోసం అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. మరి ట్రైలర్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: