పైన ఫోటోలో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటుడిగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలా చిన్న పాత్రలలో నటించి ఈయన తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దానితో ఈయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టాడు. ఈయన హీరోగా నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలు సాధించడంతో హీరో గా కూడా ఈయనకు అద్భుతమైన గుర్తింపు కోలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చింది.

ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన ఓ దర్శకుడు సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంతకు పైన ఫోటోలో ఉన్న ఆ చిన్న పిల్లాడు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన మరెవరో కాదు ... కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్. ఈయన కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. 

ఇక ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన కొంత కాలం క్రితం తెలుగు దర్శకుడు అయినటువంటి అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ప్రిన్స్ అనే సినిమాలో హీరో గా నటించాడు. తాజాగా ఈయన ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన మదరాసి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమాతో శివ కార్తికేయన్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk