ఇది నిజంగా నందమూరి అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో, సినిమా ఇండస్ట్రీలో బాలయ్య గురించి మాట్లాడాలంటే ఒకే ఒక్క అంశం హైలైట్‌గా మారేది. బాలయ్యను ట్రోల్ చేయాలంటే కూడా అదే విషయాన్ని పట్టుకుని బాగా సాగదీసేవారు. అయితే ఇప్పుడు ఆ విషయాన్నే బాలయ్య కంప్లీట్ చేసే పనిలో బిజీ అయిపోయారని సినీ వర్గాల్లో న్యూస్ ట్రెండ్ అవుతోంది. మనందరికీ తెలిసిందే, బాలయ్య అంటే ఒక హీరో మాత్రమే కాదు, మనసున్న మంచివ్యక్తి. ఇది ఆయనను దగ్గరగా గమనించిన వాళ్లకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఆయన అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వేరే లెవెల్‌లో ఆయనను పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో బాలయ్య ఒక కారణంగా ట్రోల్ అవుతూనే ఉంటారు.


ఆయన తన సినిమాలకు సపోర్ట్ చేసుకుంటారే కానీ పక్క సినిమాలకు సపోర్ట్ చేయరని, పక్క స్టార్‌ల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వమంటే ఇవ్వలేదని అందుకే నానా రకాలుగా మాట్లాడేవారు. నిజమే, బాలయ్య ఇప్పటివరకు తన గాత్రాన్ని కేవలం తన సినిమాలకే వాడుకున్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం తమ సినిమాలకు మాత్రమే కాకుండా పక్క హీరోల సినిమాలకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఇన్నాళ్లకు బాలయ్య కూడా ఆ పని చేయబోతున్నారని వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య.. ఫస్ట్ టైం తన కెరీర్‌లో ఒక సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. అల్లు అర్జున్ హీరోగా - అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్.



ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్స్ కోసం అల్లు అర్జున్ క్యారెక్టర్‌కి బాలయ్య వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట. గతంలో జల్సా సినిమాకి మహేష్ బాబు ఎలా వాయిస్ ఇచ్చారో.. ఇప్పుడు అదే విధంగా బాలయ్య కూడా చేయబోతున్నారని వార్త వైరల్ అవుతోంది. నిజానికి బాలయ్య నుంచి ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. బన్నీ కటౌట్‌కి బాలయ్య వాయిస్.. ఆ గంభీరం, ఆ దూకుడు, ఆ హెడ్ వెయిట్—అన్నీ స్క్రీన్‌పై బాగా సెట్ అయితే కెవ్వు కేకే అంటున్నారు అభిమానులు. చూడాలి మరి దీనిపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: