టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఇప్పటివరకు ఆయన తన కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి. నాగార్జున రిజెక్ట్ చేసిన మూవీలలో మంచి విజయాలను సొంతం చేసుకున్న మూవీలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కలిసుందాం రా : వెంకటేష్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్గా నటించింది. 2000 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ సమయంలో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో మొదట హీరోగా వెంకటేష్ ను కాకుండా నాగర్జున ను అనుకున్నరాట. అందులో భాగంగా నాగార్జునను సంప్రదించగా ఆయన మాత్రం కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేను అని చెప్పాడట. దానితో వెంకటేష్ ను ఈ మూవీ లో హీరో గా తీసుకున్నారట. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

బద్రి : పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ 2001 వ సంవత్సరం విడుదల అయింది. ఈ సినిమాలో మొదట పూరి జగన్నాథ్ , పవన్ కళ్యాణ్ ను కాకుండా నాగార్జున ను హీరో గా అనుకున్నారట. అందులో భాగంగా నాగార్జున ను కలిసి ఆ మూవీ కథను వినిపించగా ఆయన మాత్రం ఈ సినిమాలో నటించను అని చెప్పాడట. దానితో పవన్ కి బద్రి సినిమా కథను వినిపించగా ఆ మూవీలో హీరోగా నటించడానికి పవన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ మూవీ ద్వారా పవన్ కళ్యాణ్ కు అద్భుతమైన విజయం దక్కింది.

ఇలా నాగర్జున తన కేరిర్లో కొన్ని మంచి విజయం సాధించిన సినిమాలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: