
అయితే బాలయ్య టార్గెట్ మాత్రం సంక్రాంతి రేసులో ఉందట. సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే అఖండ సినిమాకు ఉన్న హైప్ దృష్ట్యా సంక్రాంతి సీజన్‌లో వస్తే రికార్డులు తిరగరాయడం ఖాయం. కానీ ఈ నిర్ణయం నిర్మాతల చేతుల్లో లేదు. ఇప్పుడు అన్ని సినిమాల విడుదలలు ఓటీటీ డీల్స్ ఆధారంగా ఫిక్స్ అవుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మంచి ఓటీటీ రేట్ రాకపోతే ఆ మొత్తాన్ని తిరిగి రాబట్టడం కష్టం. కాబట్టి, ఓటీటీ సంస్థలతో ఒప్పందం కుదిరిన తర్వాతే రిలీజ్ డేట్‌పై పూర్తి క్లారిటీ వస్తుంది.
మరోవైపు, ట్రేడ్ వర్గాలు మాత్రం అఖండ 2 రిలీజ్‌కు డిసెంబరు బెటర్ ఆప్షన్‌గా భావిస్తున్నాయి. డిసెంబరులో పెద్దగా పోటీ లేకుండా సినిమా సోలో రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి అయితే కనీసం మరో రెండు మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగే అవకాశం ఉంది. అలా పోటీ పెరిగితే కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ట్రేడ్ లాజిక్ ప్రకారం డిసెంబరులో రిలీజ్ చేస్తే ‘అఖండ 2’ కు తిరుగు ఉండదనే అంటున్నారు. మరి మేకర్స్ డెసిషన్ ఎలా ఉంటుందో ? చూడాలి.