బుద్ధి లేదా అలా ఎలా చేస్తావ్.. మరీ అంత బాధ్యత రహితంగా ఉంటే ఎలా..అసలు నువ్వు మనిషివేనా..అంటూ రాంచరణ్ ని ఎడా పెడా తిట్టేసారట చిరంజీవి..అయితే ఈ మాటలు వింటుంటే ఒక తండ్రి కొడుకుని ఎలా తిడతారో అలాగే ఉంటాయి.. కానీ వీళ్ళిద్దరూ సెలబ్రిటీలు కాబట్టి వీరిద్దరి మధ్య ఏం జరిగింది అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు ఉంటుంది.అయితే చిరంజీవి అంతలా మండిపడుతూ రామ్ చరణ్ ని తిట్టడానికి ఓ కారణముంది.అదేంటంటే.. రామ్ చరణ్ ఇంట్లో అన్ని విషయాల్లో నెగ్లెట్ గా వ్యవహరించడమే. రామ్ చరణ్ ప్రతి విషయంలో చాలా నెగ్లెట్ చేస్తారట. రామ్ చరణ్ మాత్రమే కాదు ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో నెగ్లెట్ గా ఉండడం చిరంజీవి చాలా సార్లు గమనించారట. కానీ చిరంజీవి మాత్రం ప్రతి ఒక్కటి ప్లాన్ ప్రకారం అన్ని సవ్యంగా జరగాలని చూసుకుంటూ ఉంటారట. 

కానీ ఇంట్లో వాళ్ల తీరు మాత్రం చిరంజీవికి అస్సలు నచ్చదట. ఇక ఈ విషయం గురించి ఓ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ..నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి చాలా కేర్ ఫుల్ గా చూసుకుంటాను. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే గీజర్ ఆన్ చేస్తారు. స్నానం చేస్తారు అది ఆఫ్ చేయకుండానే వెళ్ళిపోతారు. మళ్ళీ నేనే వెతుక్కోని మరీ ఎవరి రూమ్ లో ఆఫ్ చేయలేదు అని ఆఫ్ చేసి వస్తాను. అలాగే ఇంట్లో లైట్ లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం చాలా మంది మర్చిపోతూ ఉంటారు.కానీ ఇలా ప్రతిసారి హాల్లోకి వెళ్లి కిచెన్ లోకి వెళ్లి చూడడం ఇష్టం లేక నా ఫోన్లోనే అన్ని సెట్టింగ్స్ పెట్టుకున్నాను.అలా ఫోన్ ద్వారానే హాల్లో కిచెన్లో లైట్స్ ఫ్యాన్లు ఆఫ్ చేయడం ఆన్ చేయడం సెట్ చేసుకున్నాను. ఇక మరో విషయం ఏమిటంటే.. చరణ్ ఒకరోజు బ్యాంకాక్ కి వెళ్ళాడు.కానీ తన ఫ్లోర్లో మాత్రం లైట్స్ అన్ని ఆఫ్ చేయకుండా అలాగే వెళ్లిపోయాడు.

ఇక ఫ్లోర్ ఆన్ చేసి చూడగానే లైట్ లన్నీ వెలుగుతున్నాయి.కోపంతో వీడేంటి మరీ ఇంత బాధ్యతారహితంగా ఉన్నాడు.కనీసం లైట్లు కట్టేయలేదనే విషయం అయినా చెప్పాలి కదా.. ఛీ ఛీ  ఎన్నిసార్లు చెప్పినా ఈ వెధవలు మారరు అంటూ కోపంగా వెళ్లి లైట్ లన్నీ ఆర్పేసి వెళ్ళిపోయాను. అలా మా ఇంట్లో ఇది చాలాసార్లు నేను ఫేస్ చేశాను.కానీ నాకు ఇలా నెగ్లెట్ గా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇంట్లో వారికి ప్రతిసారి చెబుతాను బయటికి వెళ్లేటప్పుడు ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేయండి అని. కానీ ఎప్పుడూ ఎవరో ఒకరు మర్చిపోతూ వెళ్తూనే ఉంటారు. వాటిని నేను నా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ద్వారా చూసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ ఒక్క విషయంతో చిరంజీవి ఎంత బాధ్యతతో ఉంటారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు మెగా ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: