కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి లోకేష్ కనగరాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన తన కెరీర్లో ఇప్పటివరకు తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన అందులో కొన్ని మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా క్రేజ్ వచ్చింది. ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో మా నగరం , ఖైదీ , విక్రమ్ సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

ఈ మధ్య కాలంలో ఈయన దర్శకత్వం లో రూపొందిన సినిమాలు కూడా పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. కొంత కాలం క్రితం ఈయన తలపతి విజయ్ హీరో గా లియో అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి అందుకోలేదు. తాజాగా లోకేష్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే రూపొందించాడు. తాజాగా విడుదల అయిన ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఈయన ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

ఇక సినిమా హిట్ , ప్లాప్ విషయం పక్కన బెడితే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల మ్యూజిక్ కి మాత్రం అద్భుతమైన ప్రశంశలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కుతున్నాయి. తాజాగా ఈయన అనిరుద్ రవిచంద్రన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... లోకేష్ కనగరాజ్ తాజాగా మాట్లాడుతూ ... నేను చేసే ప్రతి సినిమాకు కూడా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తాడు. ఆయన లేకుంటే నేను సినిమా చేయను. ఒక వేళ ఇండస్ట్రీ అయిన వదిలేస్తాను కానీ ఆయన లేకుంటే మాత్రం సినిమానే చేయను అని కామెంట్స్ చేశాడు. ఇక తాజాగా లోకేష్ చేసిన ఈ కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk