క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూసే టోర్నమెంట్ లలో ఆసియా కప్ టోర్నమెంట్ ఒకటి. ఇకపోతే ఈ సారి ఆసియా కప్ టోర్నమెంట్ 2025 సెప్టెంబర్ 9 వ తేదీ నుండి పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. 2025 ఆసియా కప్ టోర్నమెంట్ లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ ఎనిమిది జట్లను రెండు భాగాలుగా విభజించారు. ఒకటి ఏ గ్రూప్ గాను , రెండోది బ్రీఫ్ గ్రూపు గాను ఉండబోతుంది. ఏ గ్రూపులో నాలుగు టీములు ఉండనుండగా  , బి గ్రూప్ లో నాలుగు టీం లు ఉండనున్నాయి. గ్రూప్ ఎ లో భారత్ ,  పాకిస్తాన్ , యూ ఏ ఈ ,  ఓమన్ టీములు ఉన్నాయి. ఇక గ్రూప్ బి లో శ్రీలంక , బంగ్లాదేశ్ , ఆఫ్గనిస్తాన్ ,హాంకాంగ్ జట్లు ఉన్నాయి.

ఇక గ్రూప్ ఏ లో మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లు , గ్రూప్ బి లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు కలిపి టాప్ 4 లోకి చేరుతాయి. ఇకపోతే ఆఖరుగా 2022 వ సంవత్సరం ఆసియా కప్ జరిగింది. ఈ టోర్నీ లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఇకపోతే ఏదైనా పెద్ద స్థాయి టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే చాలు దానిలో గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారు అనే ఆసక్తి జనాల్లో రేకత్తుతూ ఉంటుంది. ఇక ఆసియా కప్ 2022 తో పోలిస్తే 2025 కి ప్రైజ్ మనీ చాలా బాగా పెరిగింది. 2022 వ సంవత్సరం ఆసియా కప్ విజేతగా నిలిచిన శ్రీలంక జట్టుకు 200000 డాలర్లు అనగా 1.6 కోట్ల రూపాయలు దక్కాయి.

ఇక 2025 వ సంవత్సరం ఆసియా కప్ విజేతకు 300000 డాలర్లు అనగా దాదాపు 2.6 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ గా అందనున్నట్లు తెలుస్తోంది. ఇక 2025 ఆసియా కప్ లో రన్రప్ గా నిలిచిన జట్టుకు 150000 డాలర్లు అనగా సుమారు 1.3 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ గా  అందనున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ లో మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు 80 లక్షలు , నాలుగవ స్థానంలో నిలిచిన జట్టుకు 60 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ గా అందబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: